![]() |
చాలా బావుంది కదా... |
మా "పాసింగ్ అవుట్ పరేడ్" కు ముఖ్య అతిధిగా అప్పటి రాష్ట్ర "హొం శాఖ" అమాత్యులు వచ్చారు. మేము ఉదయం 0630 గంటలకు గ్రౌండ్ కు వెళ్లితే, ముఖ్య అతిధి వచ్చి పరేడ్ మొదలయ్యేసరికి దాదాపు 0830 గంటలు అయింది. ఎండాకాలం పొద్దున్న కావటంతో మాకు కాళ్ళు లాగటం, కొంతమందికి కళ్ళు తిరగటం మొదలైన సమస్యలు మొదలయ్యాయి. అందుకే ట్రైనీలు వీటన్నిటికి తట్టుకునేలా "పాసింగ్ అవుట్ పరేడ్" కోసం తీవ్రమైన ప్రాక్టీసు చేపిస్తారు. మొత్తానికి ముఖ్య అతిధి రాకతో మా "పాసింగ్ అవుట్ పరేడ్" మొదలైంది. మొదట "పరేడ్ కమాండర్" వెళ్లి ముఖ్య అతిధికి గౌరవవందనం చేయటం మరియు పరేడ్ ను మొదలు పెట్టటానికి అనుమతి కోరటంతో పరేడ్ మొదలు అయింది.
పరేడ్ లో భాగంగా ముందు "పరేడ్ కమాండర్" నడుస్తుండగా, వెనక మొత్తం పరేడ్ లో ఉన్న విభాగాలు అన్నీ ఒక్కొక్కటిగా "స్క్వాడ్ కమాండర్ల" నేతృత్వంలో స్టేజ్ పై ఉన్న ముఖ్య అతిధి ముందు నుంచి కవాతు చేస్తూ వెళుతూ ఆయనకు "గౌరవవందనం" సమర్పించాలి. నాది మొత్తం పది విభాగాలలో మధ్యలో అనగా అయిదవ విభాగం. ప్రతి విభాగం ముఖ్య అతిధి ముందుగా వెళుతున్నపుడు చేసే కవాతు కి అందరూ చప్పట్లతో అభినందించేవారు. మా "పాసింగ్ అవుట్ పరేడ్" వ్యాఖ్యానం కోసం ఒక మహిళా రేడియో వ్యాఖ్యాతను తీసుకు వచ్చారు. ప్రతి విభాగం ముఖ్య అతిధి ముందుగా వెళుతున్నపుడు ఆమె ఆ "స్క్వాడ్ కమాండర్" పేరు చెపుతూ మరియు ఒకవేళ అతని ప్రత్యేకతలు ఏమైనా ఉంటే చెప్పేది. నా విభాగం వంతు వచ్చినపుడు కొంత టెన్షన్ గా ఉన్నా నేను సరిగానే కమాండ్స్ ఇస్తూ "గౌరవ వందనం" సమర్పించాము. అపుడు ఆ వ్యాఖ్యాత నా పేరు చెపుతూ, నేను ట్రైనింగులో "బెస్ట్ ఆల్ రౌండర్ మరియు బెస్ట్ ఇండోర్ ట్రైనీ" అని చెప్పటంతో చప్పట్లు మరింతగా మోగటం నాకు ఉత్తేజాన్ని కలిగించింది.
మొత్తం అన్ని విభాగాలు "గౌరవ వందనం"సమర్పించి మరల తమ తమ స్థానాల్లోకి వచ్చి చేరిన తర్వాత మా ప్రిన్సిపాల్ గారు మా ట్రైనింగ్ గురించి ఒక రిపోర్ట్ చదవటం, తదుపరి ముఖ్య అతిధి మాట్లాడటం జరిగాయి. అనంతరం మాతో మా ముందు జాతీయ పతాకం చేబూని కొంతమంది మా ట్రైనీలు కవాతు చేస్తూ వెళుతుండగా, మా ట్రైనీలందరితో ప్రమాణం చేపించారు. తదుపరి ట్రైనింగులో వివిధ అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ముఖ్య అతిధి చేతుల మీదుగా బహుమతులు అందించే కార్యక్రమం మొదలైంది. "బెస్ట్ ఇండోర్ మరియు బెస్ట్ ఆల్ రౌండర్" గా రెండు బహుమతులను అప్పటి "హొం మంత్రి" చేతుల మీదుగా, వీక్షకుల కరతాళ ధ్వనుల మధ్య అందుకుంటున్నపుడు నాకు మాటల్లో చెప్పలేని ఆనందం కలగగా, జనాల్లో ఉండి ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన నా తల్లితండ్రులు ఆనందం వర్ణనాతీతం. నాకు రెండు బహుమతులకు రెండు పేద్ద కప్పులు అంటే 1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిస్తే కపిల్ దేవ్ కు ఇచ్చారే అంత పెద్ద కప్పులు ఇచ్చారు. మొత్తం "పాసింగ్ అవుట్ పరేడ్" అయిపోయిన తర్వాత నాతో పాటు బహుమతులు వచ్చిన మరో ట్రైనీతో పాటు మా ప్రిన్సిపాల్ గారు ఫోటోలు దిగాము. మా తల్లితండ్రులు, నేను నాకు వచ్చిన బహుమతులతో మా ప్రిన్సిపాల్ గారితో దిగిన ఫోటో నా జీవితంలో ఎపుడూ కళ్ళముందే గుర్తొస్తుంది. ఇక నాకు వచ్చిన పేద్ద కప్పులతో ఎంతమంది ఫోటోలు దిగారో.
ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని నేరుగా ఇంటికి పంపకుండా మా జిల్లా పోలీసు కేంద్రానికే పంపారు. నేను రెండు రోజుల తర్వాత గానీ ఇంటికి వెళ్ళలేదు. ట్రైనింగ్ సెంటర్ ను వదిలి వెళ్ళేటపుడు చాలా బాధ కలిగింది. అయితే నాకు వచ్చిన రెండు పెద్ద కప్పులు చెరోకటి పట్టుకొని మా అమ్మానాన్న మా ఉరిలో బస్సు దిగి మా ఇంటికి నడిచి వెళ్తుంటే అడగని వారే లేరని నేను ఇంటికెళ్ళాక వాళ్ళు చెపుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ట్రైనింగ్ అయిపోయి జిల్లాకి వెళ్ళినా మా కష్టాలు తీరలేదు. ఎలాగంటే..
(పోలీసు ఉద్యోగంలోని సాధక భాదకాలను మీ బందువులో లేక స్నేహితులో ఎవరైనా పోలీసుగా ఉంటే, వారికి ఎలాంటి బేషజాలు లేకుంటే ఇంకా హృద్యంగా వివరించగలరు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
--కృతజ్ఞతలతో.
![]() |
ఈ ఫోటో నాది కాదులెండి, బావుందని పెట్టా... |
మొత్తం అన్ని విభాగాలు "గౌరవ వందనం"సమర్పించి మరల తమ తమ స్థానాల్లోకి వచ్చి చేరిన తర్వాత మా ప్రిన్సిపాల్ గారు మా ట్రైనింగ్ గురించి ఒక రిపోర్ట్ చదవటం, తదుపరి ముఖ్య అతిధి మాట్లాడటం జరిగాయి. అనంతరం మాతో మా ముందు జాతీయ పతాకం చేబూని కొంతమంది మా ట్రైనీలు కవాతు చేస్తూ వెళుతుండగా, మా ట్రైనీలందరితో ప్రమాణం చేపించారు. తదుపరి ట్రైనింగులో వివిధ అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ముఖ్య అతిధి చేతుల మీదుగా బహుమతులు అందించే కార్యక్రమం మొదలైంది. "బెస్ట్ ఇండోర్ మరియు బెస్ట్ ఆల్ రౌండర్" గా రెండు బహుమతులను అప్పటి "హొం మంత్రి" చేతుల మీదుగా, వీక్షకుల కరతాళ ధ్వనుల మధ్య అందుకుంటున్నపుడు నాకు మాటల్లో చెప్పలేని ఆనందం కలగగా, జనాల్లో ఉండి ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన నా తల్లితండ్రులు ఆనందం వర్ణనాతీతం. నాకు రెండు బహుమతులకు రెండు పేద్ద కప్పులు అంటే 1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిస్తే కపిల్ దేవ్ కు ఇచ్చారే అంత పెద్ద కప్పులు ఇచ్చారు. మొత్తం "పాసింగ్ అవుట్ పరేడ్" అయిపోయిన తర్వాత నాతో పాటు బహుమతులు వచ్చిన మరో ట్రైనీతో పాటు మా ప్రిన్సిపాల్ గారు ఫోటోలు దిగాము. మా తల్లితండ్రులు, నేను నాకు వచ్చిన బహుమతులతో మా ప్రిన్సిపాల్ గారితో దిగిన ఫోటో నా జీవితంలో ఎపుడూ కళ్ళముందే గుర్తొస్తుంది. ఇక నాకు వచ్చిన పేద్ద కప్పులతో ఎంతమంది ఫోటోలు దిగారో.
![]() |
ప్రతి పోలీసు అధికారి ఈ ప్రమాణం చేసాకే ఉద్యోగం మొదలెడతాడు |
(పోలీసు ఉద్యోగంలోని సాధక భాదకాలను మీ బందువులో లేక స్నేహితులో ఎవరైనా పోలీసుగా ఉంటే, వారికి ఎలాంటి బేషజాలు లేకుంటే ఇంకా హృద్యంగా వివరించగలరు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
--కృతజ్ఞతలతో.
Great and Congratulations. After looking at your sensitivity and humble nature through your narration style, I dont have any doubt that you became helpful to so many people leave aside the professional growth.
ReplyDeleteమీ ఆనందాన్నీ, ఆ క్షణంలోని మీ ఉద్వేగాన్నీ అక్షరాలలో పలికించారు. బాగుందండి.
ReplyDeleteఅభినందనలండీ.... ఎప్పుడు తలుచుకున్నా మీకూ గర్వంగా కూడా ఉంటుందనుకుంటా
ReplyDelete