![]() |
చెప్పటం తేలికే, చెయ్యటమే మరి కష్టం! |
మేము హైదరాబాద్ ట్రైనింగులో ఉండగా మాకు ఎప్పుడు ఈ ట్రైనింగ్ అయిపోతుందా అని ఎదురు చూసే వాళ్ళం. ఎందుకంటే 24 గంటలు క్రమశిక్షణతో, ఉన్నతాధికార్ల అజమాయిషీలో ఉండటం మరియు శిక్షణ ఎపుడు తప్పుతాయా అని అనిపించేది. అది గమనించిన మా ట్రైనర్ మాతో చాలాసార్లు "మీరు వీలైనంత తొందరగా ట్రైనింగ్ అయిపోతే బావుండు, బయటికి వెళ్లి సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నన్ని రోజులే మీరు సంతోషంగా ఉండేది, ట్రైనింగ్ అయిపోయి మీరు విధులలో చేరితే ఇక మీకు అన్నీ బరువు భాద్యతలు, కష్టాలే" అని అనేవాడు. కానీ మాకు అది వింతగా అనిపించేది, ఎందుకంటే ట్రైనింగ్ అయిపోతే మేము స్వతంత్రంగా ఉండొచ్చు అని అనుకునేవాళ్ళం. కానీ ఆయన చెప్పింది మాకు అనుభవంలోకి రావటానికి ఎంతో కాలం పట్టలేదు.
ఇక మాకు ఆర్.ఐ. గారు మేము జిల్లాకేంద్రానికి వచ్చిన రెండవ రోజునుండే పూర్తి గ్రే హౌండ్స్ తరహా శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ షెడ్యూలుకు మా శరీరాలు అలవాటు పడటానికి మాకు పదిరోజులు పైనే పట్టింది. ఉదయం 0530 గంటలకే మాకు గ్రౌండ్లో శిక్షణ మొదలయ్యేది. మేము ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న 9 నెలల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇంతలా కష్టపడింది లేదు. మాకు వారంలో ప్రతి రోజు పొద్దున్నే, ఒక రోజు 10 కి.మీ. పరుగుపందెం 50 ని.లలో పరుగెత్తటం, తరవాతి రోజు అడ్డంకులను అధిగమించటం, మరుసటి రోజు 3.2 కి.మీ. పరుగును వీపుపై 5 కిలోల బరువుతో, చేతిలో తుపాకీతో మరియు కాళ్ళకు స్పోర్ట్స్ బూట్లు కాకుండా "జంగిల్ షూ" అనబడే ప్రత్యేక తరహా బూట్లు వేస్కుని 17 ని.లలో పరుగెత్తటం, ఒక రోజు తుపాకీ పేల్చటంలో శిక్షణ ఇలా ఒక వరుస క్రమంలో 6 రోజులూ ఏదో ఒక శిక్షణ ఉండేది. మాకు రోజులో ఉదయం అల్ఫాహారానికి, స్నానాదికాలకు కలిపి ఒక గంట, మధ్యాహ్నం భోజనానికి గంటన్నర, విరామాలతో రాత్రి 7 గంటల వరకు అలుపెరగని శిక్షణ ఇచ్చేవారు.
ట్రైనింగ్ సెంటర్లో మా 9 నెలల శిక్షణ కాలంలో నాతో సహా చాలా మంది ట్రైనీలు ఏదో ఒక సందర్భంలో ట్రైనర్లకో, ఇతర సిబ్బందికో ఎదురు తిరగటం లేదా ఏదో ఒక విషయంలో గొడవ పడటమో జరిగాయి. కానీ మాకు జిల్లాకేంద్రంలో ఆర్.ఐ. గారి వద్ద శిక్షణ మొదలైన వారంలోనే జరిగిన ఒక సంఘటన వల్ల, మేము ఆయన వద్ద తీసుకున్న రెండు నెలల్లో ఏ ఒక్క ట్రైనీ కూడా ట్రైనింగ్ ఇచ్చే సిబ్బందికి ఎదురు తిరగాలని ఆలోచించే సాహసం కూడా చేయలేకపోయారు.
(ఇపుడు పోలీసు వ్యవస్థలో చాలా మంచి పోలీసు అధికారులు ఉన్నారు, కాబట్టి త్వరలోనే మనం ఇంకా మెరుగైన పోలీసింగ్ చూడగలమని నా అభిప్రాయం)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
--కృతజ్ఞతలతో.

మీ బ్లాగంతా చదివేశానోచ్! భలే రాస్తున్నారు... ఎక్కడన్నా మీ పుటో ఉంటుందేమో అని వెతికా..;)
ReplyDeleteబాగుంది సార్.. పోలిస్ వాళ్ళ కష్టాలు బాగా చెప్పారు మా బ్రదర్ యస్.ఐ సిటీ లో చేస్తున్నారు డ్యూటీ కి వెళ్లారు అంటే ఎన్ని రోజులు వెళ్తారో తెలియదు సిటీ లోనే ఇలా ఉంది అంటే ఇంక "మావోయిస్ట్" ప్లేస్ లో ఇంకా ఎలా ఉంట్టుందో ఉహ కే అందటం లేదు.. మీ అభిప్రాయాలూ తెలియపరిచినదుకు ధన్యవాదములు
ReplyDelete