![]() |
ఆయుధాలు ఎంత అందంగా ఉన్నాయో కదా, చూడటానికి... |
ఆర్.ఐ. గారు గ్రే హాండ్స్ లో పని చేసినందు వల్ల, దాదాపు ఆ ట్రైనింగ్ లో ఉన్న విధివిధానాలనే మాకు జిల్లాకేంద్రంలో అమలు చేయటంతో మాకు ఇన్ని కస్టాలు వచ్చి పడ్డాయి. మేము హైదరాబాద్ లో మాతో పాటు ట్రైనింగ్ చేసిన ఇతర జిల్లాలకు చెందిన ట్రైనీలను వాకబు చేయగా, వాళ్ళందరూ పోలీసు స్టేషన్ లలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిసి మాకు ఇంకా బాధ కలిగింది. సరే మొత్తానికి క్రిందా, మీదా పడి జిల్లా కేంద్రంలో రెండు నెలల పాటు ఆర్.ఐ. గారి శిక్షణ పూర్తి చేసుకున్నాము. ఈ శిక్షణ మొత్తం రెండు నెలల కాలంలో నేను మా జిల్లాకేంద్రం కు 15 కి.మీ. లోపే ఉన్న మా ఊరికి నాలుగైదు సార్లు మించి వెళ్లలేదంటే ఎంత తీరికలేని శిక్షణ ఆర్.ఐ. గారు మాకు ఇచ్చారో ఊహించుకోవచ్చేమో...
సరే జిల్లా కేంద్రంలో శిక్షణ అయిపోవచ్చింది. దాంతో మాకు ఆ రెండు నెలల్లో ఆర్.ఐ. గారు నేర్పించిన "మావోయిస్ట్ వ్యతిరేఖ" శిక్షణ పై ఒక వ్రాత పరీక్ష పెట్టారు. అందరికీ ఏమో కానీ నాకు మాత్రం వ్రాత పరీక్ష అంటే కొంత ఆందోళన గానే ఉంది. ఎందుకంటే నేను హైదరాబాద్ ట్రైనింగ్ లో ఫస్టు వచ్చా కాబట్టి ఇపుడు వేరెవరైనా ఈ వ్రాత పరీక్షలో ఫస్టు వస్తే నేను హైదరాబాద్ ట్రైనింగ్ లో ఏదో గాలివాటంగా ఫస్టు వచ్చానని అంతా అనుకుంటారు కదా!. అందుకే ఎలాగైనా నేను ఫస్టు రావాలనే ఉద్దేశ్యంతో బాగా కష్టపడి చదివాను. నా కష్టానికి తగ్గట్టుగా ఆ వ్రాత పరీక్షలో కూడా నేను ఫస్టు రావటంతో నా మీద ఎవరికైనా కొద్దో గొప్పో ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ "ముందుంది ముసళ్ళ పండగ" అనేది మాకెవరికీ అపుడు తెలీదు...
(పోలీసులకు కూడా అందరిలాగే భావోద్వేగాలు ఉంటాయి, కాకపోతే వాటిని అదుపులో పెట్టుకోకపోతే ప్రమాదం.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
--కృతజ్ఞతలతో.

>> వాళ్ళందరూ పోలీసు స్టేషన్ లలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిసి మాకు ఇంకా బాధ కలిగింది
ReplyDelete:-)))
గతాన్ని గుర్తుంచుకున్న తీరు, దానిద్వారా మీకొచ్చిన పట్టుదల బాగుందండి.