![]() |
వినాయక నిమజ్జనం డ్యూటీ పోలీసులకు ఎప్పుడూ కత్తిమీద సాములాంటిదే |
ట్రైనింగ్ లో ఉండగానే మమ్మల్ని వినాయకచవితి నిమజ్జనంకు కూడా బందోబస్తుకు పంపారు. నన్ను మరి కొంతమందిని గాంధీనగర్ పోలీసు స్టేషన్ కు పంపారు. ట్యాంక్ బండ్ ప్రాంతమంతా ఆ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది, అంటే దాదాపు నిమజ్జన ప్రాంతమంతా వస్తుంది. మేము దాదాపు పది రోజులు అక్కడ విధులు నిర్వహించాము. మాకు ఒక కళ్యాణ మండపంలో వసతి కల్పించారు. అందులో పెద్ద హాలు ఉండేది మరియు అందరికి సరిపడా స్నానపు గదులు లేక చాలా ఇబ్బందిగా ఉండేది. మేము అంతకు ముందే వరదలపుడు బయటి డ్యూటీ చేసినా రాత్రికల్లా రూముకు వచ్చేవాళ్ళం కాబట్టి బందోబస్తు డ్యూటీలలో పోలీసుల ఇబ్బందులు గురించి మాకు తెలీలా. మాకు నిమజ్జనం ముందు రోజు వరకు విగ్రహాల దగ్గర పెట్రోలింగ్ డ్యూటీ వేసారు. తర్వాత నిమజ్జనం ముందు రోజు నుండి ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేసే క్రేన్ వద్ద డ్యూటీ వేసారు. క్రేన్ కు ప్రజలు అడ్డుపడకుండా చూడటం, క్రేన్ మీదకు విగ్రహం తప్ప ప్రజలు వెళ్ళకుండా చూడటం, మరియు ప్రజలు నీళ్ళలో పడకుండా చూడటం మొదలైన విధులు చేసేవాళ్ళం. అయితే కొంతమంది " మేమూ విగ్రహంతో పాటు వెళ్లి మా విగ్రహాన్ని మేమే నిమజ్జనం చేస్తాం" అని గొడవ పెట్టుకునేవాళ్ళు. కానీ మేము ఎలాగోలా సర్ది చెప్పేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళను వెళ్లనిస్తే ఏదైనా ప్రమాదం జరిగిందంటే నిమజ్జనం విషాదం అవుతుంది". కాబట్టి నిమజ్జనం చేసేందుకు క్రేనుపై డిపార్టుమెంటు అనుమతించిన వాళ్ళు తప్ప ఎవరినీ పంపే వాళ్ళం కాదు. నిమజ్జనం మొదలైన రోజునుండి అయిపోయేవరకు రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసాము. ట్రైనింగ్ సెంటర్ కు తిరిగి వచ్చేసరికి మేము పూర్తిగా అలసిపోయాము. అందుకే ట్రైనింగ్ కు ఒక రోజు విశ్రాంతి ఇచ్చారు.
మేము వరదల డ్యూటీకి వెల్లినపుడైనా మరియు నిమజ్జనం డ్యూటీకి వెళ్ళినపుడు కూడా మా ట్రైనర్ మాతోనే ఉండేవాడు. ఎందుకంటే మేము ట్రైనీలం కాబట్టి మాకు ఏమీ సమస్యలు లేకుండా చూడటానికి మరియు మా వల్ల సమస్యలు రాకుండా చూడటానికి. అయితే వినాయక చవితి నిమజ్జనం డ్యూటీ మాత్రం భవిష్యత్తులో పోలీసు డ్యూటీ ఎలా ఉండబోతుందో, బందోబస్తు విదులలో పోలీసులకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలియజేసింది. ఒకటి మాత్రం నిజం పోలీసులకు ఇప్పటికి కూడా ఎక్కడైనా బందోబస్తు విధులలో నియమించారంటే సరైన సౌకర్యాలు ఉండవు. అయినా ఏనాడూ పోలీసులు రోడ్డెక్కడం మనం చూడం. ఎలక్షన్ డ్యూటీలలో ఉన్న మిగిలిన డిపార్టుమెంటుల కు చెందిన సిబ్బంది సరైన సౌకర్యాలు లేవనో, సరిపోను TA, DA లు ఇవ్వలేదనో ధర్నాలు చేయటం, విధులు బహిష్కరించటం మనం చూసాం. కానీ పోలీసులు ఎప్పుడూ అలా చేయలేదు, చేయరు కూడా. ఎందుకంటే సరైన సౌకర్యాలు ఉన్నా లేకున్నా విధులు నిర్వహించటం పోలీసుల ప్రాథమిక కర్తవ్యం.
(పోలీసులు ఎన్ని విపత్కర పరిస్థితులలో ఉద్యోగం చేస్తున్నారో, ప్రస్తుత రాజకీయ, సామాజిక కారణాలు, తీవ్రవాద, ఉగ్రవాద కోణాల్లో ఒక్కసారి ఆలోచించండి)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
--కృతజ్ఞతలతో.
No comments:
Post a Comment