![]() |
మనకి కనిపించే ఈ అందమైన డ్రిల్ వెనక కఠోరమైన ప్రాక్టీసు ఉంటుంది. |
ట్రైనింగ్ కు వెళ్ళినప్పటినుండే నాకు "తుపాకీని ఎపుడు చూస్తానా! ఎపుడు చేతిలోకి తీస్కుంటానా! ఎపుడు ఫైర్ చేస్తానా!" అని ఉత్సుకతగా ఉండేది. అయితే వెళ్ళిన కొద్దిరోజులకి మాకు 3.2 కి.మీ. పరుగు పందెంలో చెక్క తుపాకీ చేతికి ఇచ్చినపుడు తాత్కాలిక ఆనందం కలిగినా నిజమైన తుపాకీని పట్టుకోవాలని మనసు ఆరాటపడుతుండేది. నాకే కాదు మాలో చాలా మందికి అదే ఆత్రుత ఉండేది. అందుకే కొంతమంది ధైర్యం చేసి మా ట్రైనర్ ను "మాకు తుపాకీ ఎపుడు చేతికి ఇస్తారు సార్? ఫైరింగ్ ఎపుడు చేపిస్తారు?" అని అడిగారు. దానికి ఆయన నవ్వి "------ రాగానే సంబరం కాదు" అని ఒక మోటు సామెత చెప్పి, 'ఇపుడేమో ఎపుడు చేతికి తుపాకీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు, మీకు చేతికి ఇచ్చాక ఎపుడు ఇది మమ్మల్ని వదిలి పెడుతుందా అని అనుకుంటారు' అని అన్నాడు. ఎంతోమంది మాలాంటి వాళ్ళని చూసిన అనుభవంతో ఆయన చెప్పిన మాటలు అపుడు మాకు అర్థం కాలేదు.
కొద్దిరోజుల తర్వాత మాకు "ఆర్మ్స్ డ్రిల్" అనగా తుపాకీతో చేసే డ్రిల్ మొదలైంది. తొలిసారి తుపాకీని చేతిలోకి తీస్కున్నాక , ఏదో తెలియని ఆనందం మనసుని ఆవహించింది. కొద్దిరోజుల వరకు ఆ అనుభూతి మనసులో అలాగే ఉండిపోయింది. అయితే రోజూ పొద్దున్నే నేరుగా గ్రౌండ్ కి వెళ్ళే మేము "ఆర్మ్స్ డ్రిల్" మొదలైన రోజునుండి, ఆయుధాగారానికి వెళ్ళి తుపాకీ తీస్కోని వెళ్ళటానికి 15 నుండి 20 నిమిషాలు ముందుగా బయలుదేరాల్సి వచ్చేది. డ్రిల్ అయిపోయిన తర్వాత ఆయుధాగారానికి వెళ్ళి తుపాకీ డిపాజిట్ చేసి వెళ్ళటానికి మరో 15 నుండి 20 నిమిషాలు సమయం తీస్కునేది. దాంతో మా రెస్ట్ సమయం కొంచెం తగ్గిపోయింది. ఇక మాకు "ఆర్మ్స్ డ్రిల్" లో భాగంగా డ్రిల్ లో ఎక్కువ సమయం తుపాకీ మా భుజం పైనే ఉండేది. దాంతో కొద్దిరోజుల వరకు భుజం మరియు చేతులు తీవ్రంగా నొప్పి పెడుతుండేవి. ఎపుడు భుజం మీద నుండి తుపాకీని క్రిందకు దింపుతామా అని మేము ఎదురు చూస్తుండే వాళ్ళం. కానీ మా ట్రైనర్ మాకు అలవాటు కావాలని ఎక్కువ సమయం భుజం పైనే తుపాకీని ఉంచేవాడు. అపుడు కానీ మాకు మా ట్రైనర్ ఎందుకు మమ్మల్ని తుపాకీ కోసం తొందర పడొద్దని చెప్పాడో అర్థం కాలేదు.
కొద్దిరోజులకి మాకు తుపాకీని భుజంపై మోయటం అలవాటైపాయింది. దాంతో మళ్ళీ మాలో కొందరు "మాకు ఫైరింగ్ ప్రాక్టీసు ఎపుడు చేపిస్తారు సార్?" అని అడగటం మొదలు పెట్టారు. అపుడు మా ట్రైనర్ "నేను మీరు తుపాకీ అడిగిన రోజే చెప్పా తొందరపడొద్దని, మళ్ళీ మీకు అదే తొందర" అని సున్నితంగా హెచ్చరించాడు. తర్వాత మాకు తుపాకీతో ఫైరింగ్ చేపించటానికి చాలా కటినమైన ప్రాక్టీసు చేపించేవారు. ఆ ప్రాక్టీసు ఎంత కటినంగా ఉన్నా మాకు మాత్రం ఎపుడు ఆ తుపాకీతో ఫైరింగ్ చేస్తామా అని చాలా ఆసక్తిగా ఉండేది. ట్రైనీలు ఎవరైనా తుపాకీ క్రింద పడేయటం లేదా తుపాకీ పట్ల ఏ విధంగా అయినా ఏమాత్రం అశ్రద్ధ చూపినా చాలా తీవ్రమైన శిక్షలు ఉండేవి. డ్రిల్ కు ముందు మరియు తర్వాత తుపాకీని శుబ్రంగా తుడవాలి. అందుకే తుపాకీ చేతిలోకి తీస్కున్న తర్వాతగానీ దాని పట్ల మా భాద్యతలు, ప్రవర్తించాల్సిన విధానం తెలిసి వచ్చింది. ఎందుకంటే తుపాకీతో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మన మరియు మన తోటివారి ప్రాణాలకే ప్రమాదం.
(పోలీసుల సేవలను ప్రజలు గుర్తించినపుడే వారు పడే కష్టానికి సార్థకత చేకూరుతుంది.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
--కృతజ్ఞతలతో.
(పోలీసుల సేవలను ప్రజలు గుర్తించినపుడే వారు పడే కష్టానికి సార్థకత చేకూరుతుంది.)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
--కృతజ్ఞతలతో.
ఆశక్తిని రేకెత్తించేలా ఉంటున్నాయి మీ టపాలు. పోలిస్ ఉద్యోగం పట్ల ఆశక్తి గలవారికి ఈ బ్లాగు ఉపయోగపడేలాగా మంచి సమాచారం ఇవ్వండి .
ReplyDeleteఈ బ్లాగులో కామెంట్లు మాయమవుతున్నాయి. ఎందుకలా?
ఇక నుండి కామెంట్ లు మాయం కావులెండి మరియు పోలీసు ఉద్యోగార్థులకు ఏ రకమైన సమాచారం కావాలో చెపితే ఆ కోణంలో నాకు తెలిసిన సమాచారం ఇవ్వగలను.
ReplyDelete--------కృతజ్ఞతలతో.
mee blog naaku bhale nachchesindandee... good :D
ReplyDeleteకృతజ్ఞతలు రాజ్ కుమార్ గారూ...
ReplyDelete