![]() |
తుపాకీని తప్పుగా పట్టుకున్నావేమో బ్రదర్... |
"అగ్నిప్రమాదాలు" సంభవించినపుడు పోలీసులు తీసుకోవలసిన చర్యల గురించి కూడా మాకు శిక్షణ ఇచ్చారు. దాంట్లో భాగంగా మా ట్రైనింగ్ సెంటర్ కు అగ్నిమాపక సిబ్బంది తమ శకటం ను తీసుకొని వచ్చి గ్రౌండ్ మధ్యలో పెద్ద మంటను వేసి దానిని ఎలా ఆర్పుతారో, శకటం లో నుండి నీటిని ఎలా ఉపయోగిస్తారో ప్రయోగాత్మకంగా చూపించారు. అంతే కాక ఇంకా తాము మంటలను ఆర్పటానికి ఉపయోగించే, కార్బన్ డయాక్సైడ్ సిలిండర్, నురగ సిలిండర్ మొదలైన ఇతర సామాగ్రి గురించి కూడా వివరించారు.
ఇవే కాక ట్రైనింగులో ఇంకా "ప్రథమ చికిత్స" గురించి కూడా నేర్పించారు. ఏదైనా విషపురుగు కుట్టినపుడు ఏమి చేయాలి, ఆపస్మారక స్థితి లోకి వ్యక్తి వెళ్ళినపుడు ఏమి చేయాలి, మంటల్లో ఉన్న వ్యక్తిని ఏ విధంగా కాపాడాలి, నీటిలో పడిన వ్యక్తిని కాపాడిన వెంటనే ఏమి చేయాలి, కరంటు షాకుకు గురైన మనిషిని ఎలా కాపాడాలి వంటి మొదలైన విషయాలు నేర్పించారు. అంతే కాక ఆపదలో ఉన్న వ్యక్తికి అవసరమైతే "రక్తదానం" చేయాలని, రక్తదానం వల్ల ఎలాంటి నష్టం ఉండదని తెలియజేసారు.
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
--కృతజ్ఞతలతో.

నా పోలీసు జీవితంలో మొదటిసారి 'అక్టోబర్ 21' "పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం"లో మా ట్రైనింగు సెంటర్ నందు పాల్గొన్నాను. ఆ రోజు మా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేసారు. అందులో మాట్లాడిన వివిధ వక్తలు పోలీసులో ఉద్యోగ భాద్యతల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉమేష్ చంద్ర, K.S.వ్యాస్ వంటి ప్రముఖమైన పోలీసు అధికార్ల గురించి చెబుతున్నపుడు నిజంగా చాలా ఉత్తేజం కలిగింది. అందుకే ఏనాడూ రక్తదానం చేయని నేను 'అక్టోబర్ 21' "పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం" సందర్భంగా రక్తదానం చేసాను.
ట్రైనింగులో ఒకసారి మమ్మల్ని గ్రేహౌండ్స్ సెంటర్ కు తీస్కెళ్ళారు. అక్కడ ట్రైనీలకు ఇస్తున్న శిక్షణ చూసి నిజంగా భయం వేసింది. "బతికుంటే బలుసాకు తినొచ్చు కానీ ఈ ట్రైనింగ్ నేను చేయను బాబోయ్" అనిపించేలా ఉన్నాయా శిక్షణా పద్దతులు. కానీ అదే "గ్రేహౌండ్స్" ట్రైనింగ్ నేను రెండు సార్లు చేస్తానని కలలో కూడా అనుకోలేదు. మరోసారి మమ్మల్నిSI మరియు DSP లకు శిక్షణ ఇచ్చే "అప్పా" అని పిలవబడే "ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమి" కు చూపించటానికి తీస్కేళ్ళారు. అక్కడి వాతావరణం, శిక్షణా విధానాలు, సౌకర్యాలు చూసిన తర్వాత నాకు SI కావాలని అంతకుముందు ఉన్న కోరిక మనసులో ఇంకా బలపడింది.
(ఎవరైనా పోలీసులు పని వత్తిడిలో మీ సమస్య సరిగా పట్టించుకోకపోతే నిరాశ చెందకండి, పై అధికారిని కలిస్తే తప్పక మీకు న్యాయం జరుగుతుంది)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.

Good. good.
ReplyDeleteKeep going..:)