![]() |
ఈ ప్రాక్టీసు కొన్ని వందల సార్లు చేయాలి మరి... |
అయితే ఈ "పాసింగ్ అవుట్ పెరేడ్" కవాతు కోసం కనీసం 15 రోజులనుండి నెల రోజుల వరకు తీవ్రమైన ప్రాక్టీసు ఉంటుంది. మామగాడికి NCC అనుభవం ఉండటం వల్ల వాడికి ఈ ప్రాక్టీసు గురించి ముందే తెలుసు కాబట్టి వాడు నన్ను హెచ్చరించాడు. మా "పాసింగ్ అవుట్ పెరేడ్" ఏప్రిల్ నెలలో జరిగింది కాబట్టి అపుడు ఎండలు బాగానే ఉన్నాయి. మామగాడు నాతో "రేయ్, "పాసింగ్ అవుట్ పెరేడ్" అంటే రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బాగా కష్టపెట్టి ప్రాక్టీసు చేయిస్తారు, ఈ ఎండలలో మనకి అంత కష్టపడటం అవసరమా?" అని హెచ్చరించాడు. నాకూ వాడు చెప్పింది నిజమే అని అనిపించింది.
"పాసింగ్ అవుట్ పెరేడ్" ప్రాక్టీసు కోసం మొత్తం అందరు ట్రైనీలను తీసుకోరు. మొత్తం మా ట్రైనింగులో 500 మంది పైగా ట్రైనీలు ఉంటే, ఈ ప్రాక్టీసు కోసం 10 విభాగాలు అనగా 10 * 30 = 300 మంది ట్రైనీలను మాత్రమే తీసుకుంటారు. అందుకని మిగిలిన దాదాపు 200 మంది ట్రైనీలను గ్రౌండ్ ను చదునుగా చేయటం, పరిసరాలను శుభ్రం చేయించటం వంటి వేరే పనులు చేపించేవారు. అందుకని మామగాడు "పాసింగ్ అవుట్ పెరేడ్" ప్రాక్టీసులోకి ఎంపిక కాకుండా ఉందామని పథకం వేసాడు.
పరీక్షలు అయిపోయిన తర్వాత ఒక రోజు మా ట్రైనర్ మా విభాగంలోంచి "పాసింగ్ అవుట్ పెరేడ్" ప్రాక్టీసు కోసం కొంతమందిని ఎంపిక చేసాడు. మామగాడు ఎత్తు తక్కువగా ఉంటాడు కాబట్టి, వాడు బాగానే కవాతు చేయగలిగినా మా ట్రైనర్ వాడ్ని పక్కకు తీసేసాడు. వాడు బయటికి వెళ్లి నావేపు చూసి నవ్వుతూ "నువ్వూ రా! రా!" అన్నాడు చిన్నగా. నాకు మా ట్రైనర్ కు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. నేను ఎత్తుగా ఉండటం మరియు నా మీద మా ట్రైనర్ కు మంచి అభిప్రాయం ఉండటంతో నన్ను ఎంపిక చేసాడు. వెంటనే మామగాడు నా ప్రక్కకు వచ్చి "కాలునొప్పి" అని చెప్పి బయటికి వచ్చేయరా!' అని సలహా ఇచ్చాడు. నేను చిన్నగా మా ట్రైనర్ దగ్గరకు వెళ్లి నాకు కాలు నొప్పిగా ఉంది సార్, నేను ప్రాక్టీసు చేయలేను అని చెప్పాను. ఆయన నావేపు కోపంగా చూసి "అదేం కుదరదు చేయగలిగే వాడూ చేయకుండా తప్పించుకుంటే ఎలా?" అని అన్నాడు. నేను అమాయకంగా ముఖం పెట్టి లేదు సార్ నిజంగానే కాలు బెణికింది, అని అబద్దం చెప్పి మొత్తానికి "పాసింగ్ అవుట్ పెరేడ్" ప్రాక్టీసు నుంచి తప్పించుకోగలిగాను. కానీ ఈ ప్రాక్టీసు తప్పించుకొని నేను ఏం కోల్పోయానో నాకు తర్వాత గానీ తెలియలేదు...
(ప్రజలతో సత్సంబందాలు నెరపనిదే ఏ పోలీసు అధికారీ విజయవంతం కాలేడు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
--కృతజ్ఞతలతో.
(ప్రజలతో సత్సంబందాలు నెరపనిదే ఏ పోలీసు అధికారీ విజయవంతం కాలేడు)
----సలహాలకు policestory333@gmail.com కు email చేయగలరని మనవి.
----మిగిలిన వివరాలు తదుపరి పోస్టులో చెప్తానండీ.
--కృతజ్ఞతలతో.
No comments:
Post a Comment